Book uber cab car service on whatsapp
mictv telugu

వాట్సాప్ నుంచి ఉబర్ క్యాబ్ బుకింగ్.. ప్రాసెస్ ఇదీ..

August 5, 2022

అందరూ కార్లు కొనడం, మెయింటెన్ చెయ్యడం అసాధ్యం. అయితే కారు నగర ప్రజలకు ఈ రోజుల్లో నిత్యావసరమైపోయింది. అందుకే క్యాబ్ సర్వీసులు పుట్టుకొచ్చాయి. మొబైల్ యాప్స్ ద్వారా ఒలా, ఉబర్ వంటి కంపెనీల యాప్స్‌లలో బుక్ చేసుకుని పనులు చెక్కబెట్టుకుంటున్నారు లక్షల మంది. తాజాగా యాప్‌తో పనిలేకుండా వాట్సాప్ ద్వారా ఉబర్ బండిని బుక్ చేసుకునే సదుపాయం వచ్చింది. లొకేషన్ వివరాలు చెప్పి బండి ఎక్కెయ్యొచ్చు. యూజర్ల వాట్సాప్ నంబర్, ఇతర వివరాలు గోప్యంగా ఉంటాయి.
బుకింగ్ ఇలా..

తొలుత వాట్సాప్‌లో +91 7292000002 నంబర్‌కు ‘హాయ్’ అని టైప్ చేసి మెసేజ్ పంపాలి. చాట్‌బాక్సులో మీ పికప్, డ్రాప్ లొకేషన్ ఇవ్వాలి. రైడ్ సమాచారం పంపుతారు. ఛార్జీ, డ్రైవర్ వచ్చే సమయం కూడా మెసేజ్ చేస్తారు. మీరు ఓకే చస్తే డ్రైవర్ సమాచారం, OTP వస్తుంది. OTPని నమోదు చేసి సర్వీసు పొందొచ్చు.