“ఆర్డినరీ లైఫ్” వద్దంటున్న నవాజుద్దీన్ - MicTv.in - Telugu News
mictv telugu

“ఆర్డినరీ లైఫ్” వద్దంటున్న నవాజుద్దీన్

October 30, 2017

         విడుదలకు ముందే వివాదాలు సృష్టించిన బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ బయోగ్రఫీ “ఆన్ ఆర్డినరీ లైఫ్” వ్యవహారంలో కొత్త ట్విస్ట్.  తన పుస్తకంలోని విషయాలతో మనోభావాలు దెబ్బతిన్న ప్రతీ ఒక్కరు క్షమించాలని ట్విట్టర్‌లో కోరాడు. ఇంతేకాదు ఆ పుస్తకాన్ని మార్కెట్ నుంచి ఉపసహరించుకుంటానన్నాడు. జాతీయ మహిళా కమిషన్‌కు నవాజ్ మాజీ ప్రేయసీ నిహారికా సింగ్ ఫిర్యాదు చేసిన  కొంత సేపటికి నవాజ్ ఈ ప్రకటన చేశాడు.  

అసలు వివాదం ఏంటి?

తన బయోగ్రఫీ “ఆన్ ఆర్డినరీ లైఫ్”లో తన పాత ప్రేమ వ్యవహారాలను నవాజ్ బయటపెట్టడం వివాదానికి దారితీసింది. విడుదలకు ముందే బయటకొచ్చిన పుస్తకంలోని కొన్ని భాగాల్లో మాజీ గర్ల్ ఫ్రెండ్ నిహారికా సింగ్‌తో తనకున్న ఎఫైర్ గురించి నవాజ్ రాసుకున్నాడు. అయితే పుస్తకం సేల్స్ పెంచుకోవడానికే సిద్దిఖీ చవకబారు ట్రిక్స్ ప్లే చేస్తున్నాడని నిహారికా సీరియస్ అయింది. తమ మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్ లేదంది. అటు నవాజ్ ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ సునీతా రాజ్వార్ కూడా పుస్తకంలో తన గురించి చెప్పిన విషయాలన్ని అబద్ధాలే అన్నది.