హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుఎంజా వైరస్ కారణంగా కర్ణాటకలో తొలి మరణం నమోదైంది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో H3N2 వైరస్ సంక్రమణతో బాధపడుతున్న వ్యక్తి మరణించాడు. వైరస్ ఇన్‌ఫెక్షన్‌తో 85 ఏళ్ల వృద్ధుడు మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ రణదీప్ ధృవీకరించారు. వృద్ధుడికి జ్వరం, గొంతు సమస్యలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఈ వైరస్ వ్యాపించి ప్రజలను వణికిస్తోంది.
కర్ణాటకలో ఇప్పటివరకు 50కి పైగా H3N2 ఇన్ఫ్లుఎంజా వైరస్ కేసులు నమోదయ్యాయి. అందులో 6 కేసులు ఒక్క హసన్ జిల్లాలోనే ఉన్నాయి. ఇటీవలి కేసులను దృష్టిలో ఉంచుకుని, 60 ఏళ్లు పైబడిన వారు, తీవ్రంగా జ్వరంతో బాధపడుతున్న వారిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. H3N2 వైరస్‌తో బాధపడుతున్న వృద్ధుడు మార్చి 1న మరణించినట్లు చెబుతున్నారు.