హిమాలయాల్లో 20 వేల అడుగుల ఎత్తులో ఐటీబీపీ జవాన్ల యోగా - MicTv.in - Telugu News
mictv telugu

హిమాలయాల్లో 20 వేల అడుగుల ఎత్తులో ఐటీబీపీ జవాన్ల యోగా

June 6, 2022

ఉత్త‌రాఖండ్‌లోని ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు అరుదైన రికార్డు సాధించారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో.. 22,850 అడుగుల ఎత్తులో యోగా ప్రాక్టీస్ చేశారు. జూన్ 21న యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గత రెండు నెలలుగా.. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, త్రివిధ దళాలు, పారా మిలిటరీ విభాగాలు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మౌంట్ అబి గామిన్ పర్వతారోహణలో భాగంగా.. హిమవీరులు ఈ రికార్డు సాధించారు. 14 మంది సభ్యులు ఉన్న ఈ బృందం సుమారు 20 నిమిషాల పాటు యోగా సాధన చేసింది. అత్యధిక ఎత్తులో యోగా ప్రాక్టీస్ సెషన్‌ జరగడం ఇదే తొలిసారి. ప్రజలకు యోగా పట్ల అవగాహన కల్పించడానికి.. తాము హిమాలయాల్లోని ఎత్తైన ప్రాంతాల్లో యోగా చేస్తున్నట్లు ఐటీబీపీ తెలిపింది. అంతకుముందు ఇదే బృందం 24,131 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ అబీ గమిన్ ను అధిరోహించారు. ఇది హిమాలయ పర్వతాల్లో మధ్య భాగంలో ఉంది. సదరు ప్రాంతంలో ఇది రెండో అత్యంత ఎత్తయిన శిఖరం.