హిట్లర్ నుంచి తప్ఫించుకుని,. పుతిన్ చేతిలో హతం - MicTv.in - Telugu News
mictv telugu

హిట్లర్ నుంచి తప్ఫించుకుని,. పుతిన్ చేతిలో హతం

March 22, 2022

hhhh

ఉక్రెయిన్‌కు చెందిన 96 ఏళ్ల బోరిస్ రోమన్ చెన్‌కో శుక్రవారం రష్యా జరిపిన దాడుల్లో మ‌ృతి చెందాడు. ఖార్కివ్‌లో ఆయన ఉంటున్న భవనం మీద రష్యా బాంబు దాడి చేసింది. ఈ దాడుల్లో బోరిస్ మరణించారని ఉక్రెయిన్ అధ్యక్ష భవనం ఒక ప్రకటన వెలువడింది. కాగా, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బోరిస్ నాజీ కాన్‌సన్‌ట్రేషన్ క్యాంపుల్లో చిత్రవధ అనుభవించాడు. ఈయన ఉంటున్న క్యాంపులో 53 వేల మందిని హిట్లర్ సైన్యం చంపివేయగా, బతికి బయటపడ్డ కొద్ది మందిలో బోరిస్ ఒకరు. అంతేకాక, ఒకే ఏడాదిలో నాలుగు క్యాంపుల నుంచి బయటపడ్డాడు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప అలా తప్పించుకొని బతికిన వారు లేరు. ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా స్పందిస్తూ.. హిట్లర్ చేతిలో ప్రాణాలతో బయటపడ్డా, పుతిన్ చేతిలో చావు తప్పలేదంటూ ట్వీట్ చేశారు.