బోరుబొక్క పూడ్చకపోతే.. బొక్కలోకి తోస్తారు.. - MicTv.in - Telugu News
mictv telugu

బోరుబొక్క పూడ్చకపోతే.. బొక్కలోకి తోస్తారు..

June 24, 2017

ఇక నుండి ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేయడం కుదరదని, కొత్త చట్టాన్ని అమలు చెయ్యాలని అసెంబ్లీ సాక్షిగా రూల్ పాస్ చేస్తోంది సర్కార్. వితౌట్ పర్మిషన్ ఎవరైనా బోరు వేస్తే అస్సలు చెల్లదు. అలా చేస్తే ఐపిసి సెక్షన్ల కింద కేసులు బనాయించి మూడు నుండి ఏడేళ్ళు బొక్కలో తోస్తామనే, యాభై వేల రూపాయల వరకు జరీమాన కూడా విధించే గట్టి చట్టాన్ని అమలు చెయ్యాలనుకుంటోంది ప్రభుత్వం. రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం, చెన్వల్లి గ్రామంలో అభం శుభం తెలియని పసిపాప బోరు బావిలో పడిపోయింది. ఆమెని రక్షించడానికి ఇప్పటికీ సహాయక చర్యలు జరుగుతున్నాయి. పాపం పాప ప్రాణాలతో సేఫ్ గా బయట పడాలని చాలా మంది కోరుకుంటున్నారు.

ఇంతకు ముందు కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగి చాలా మంది పసివాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఎవరికివారు తమ ఇష్టానికి బోర్లు తవ్వేసి వదిలేస్తున్నారు. ఫెయిలైన బోర్లను అలా పూడ్చకుండా వదిలెయ్యడం వల్ల పిల్లలు ఆడుకోవడానికెళ్లి ఆ పొక్కల్లో పడి ప్రాణలు వదులుతున్నారు. పిల్లలు బోరుబావిలో పడ్డప్పుడు మాత్రమే అటు ప్రభుత్వాలు ఇటు ప్రజలు అప్రమత్తమౌతున్నారు గానీ తర్వాత మళ్ళీ అదే పరిస్థితి రిపీట్ అవుతోంది !? ఎందుకిలా ? పెద్దవాళ్ళ నిర్లక్ష్యానికి ఏ పాపం తెలియని చిన్నారులు ఎందుకు బలవ్వాలి ?

పంట పొలాల్లో వ్యవసాయం కోసమని రైతులు బోర్లు వేస్తున్నారు, చాలా మంది ఇళ్ళల్లో బోర్లు వేస్తున్నారు. నీళ్ళు పడని బోర్లని వెంటనే పుడిచేస్తే ఏ ప్రమాదమూ వుండదు. అలా పూడ్చకుండా నిర్లక్ష్యంగా వదిలెయ్యటం వల్ల పిల్లల ప్రాణాలు హరీ అంటున్నాయి ? నగర ప్రాంతాల్లో అయితే ఈ బోర్లది మరీ ఎక్కువైపోయింది. ఇంటింటికీ బోర్లు వేస్తున్నారు అదీ వెయ్యి గజాల పైన్నే.. ఈ బోర్ల వల్ల భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయని ఎప్పుడు తెలుసుకుంటారు ? అందుకే ఇక నుండి లాడు నడ్వది, ఎవరు ఎంత పెద్ద లాడుసాబైనా బోరులో నీళ్ళు పడకపోతే వెంటనే మూసెయ్యాలి లేదంటే జైలే గతి అని ప్రభుత్వం గట్టిగా హెచ్చరిస్తోంది.

ప్రభుత్వం కూడా ఇలాంటి పరిణామాలప్పుడే స్టేట్ మెంట్లు ఇచ్చి కొత్త చట్టాలను రూపకల్పన చేసే కన్నా ఎల్లవేళలా ప్రజా సంక్షేమం కోసం ఆ బోరు బావుల్నే కాదు ఇంకా చాలా మంచి పనులు చెయ్యాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.