ధరల ఎఫెక్ట్.. ఉద్యోగులకు భారీ బోనస్ ఇచ్చిన యజమాని - MicTv.in - Telugu News
mictv telugu

ధరల ఎఫెక్ట్.. ఉద్యోగులకు భారీ బోనస్ ఇచ్చిన యజమాని

April 7, 2022

9

పెరుగుతున్న ధరలకనుగుణంగా జీతం కానీ, ఆదాయం కానీ పెరగట్లేదని చాలా మంది ఫీలవుతుంటారు. సోషల్ మీడియాలో ఈ అంశంపై చాలా మీమ్స్ వచ్చాయి. అయితే ఓ యజమాని మాత్రం తన ఉద్యోగులకు అ పరిస్థితి రానివ్వలేదు. ఇంగ్లండులో ఓ కంపెనీ యజమాని చేసిన పని ఇప్పుడు వ్యాపార, ఉద్యోగ రంగాల్లో సంచలనంగా మారింది. వివరాల్లోకెళితే.. ఎమరీస్ టింబర్ అండ్ బిల్దర్స్ మర్చంట్స్ అనే కంపెనీకి జేమ్స్ హిప్‌కిన్స్ అనే వ్యక్తి ఎమ్‌డీగా ఉన్నారు. ఆ దేశంలో విద్యుత్, గ్యాస్, చమురు రేట్లు పెరిగిపోవడంతో ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా కంపెనీ ఉద్యోగులకు జీతంతో పాటు రూ. 74,251 (750 యూరోలు) అందించాడు. ఈ విషయాన్ని కంపెనీ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. రేట్ల వల్ల ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో అదనపు నిధులిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. దాదాపు 60 మంది ఉద్యోగులకు రూ. 44 లక్షలు (45 వేల యూరోలు) ఎమ్‌డీ వ్యక్తిగత ఖాతా నుంచి ఈ డబ్బులు చెల్లించారు.