లాక్‌డౌన్ పొడిగించాలని మేం చెప్పలేదు.. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్  - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్ పొడిగించాలని మేం చెప్పలేదు.. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ 

April 7, 2020

Boston consultancy group on corona

కరోనా లాక్‌డౌన్‌ను మరికొన్ని నెలలు పొగిడించాలని బోస్టన్ కన్సల్టెంగ్ గ్రూప్ (బీసీజీ) చెప్పినట్లు వచ్చిన వార్తలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా నిన్నటి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ లాక్ డౌన్‌ను పొడిగించాల్సి ఉంటుందని బీసీజీ చెప్పిందంటూ ఓ నివేదికను చూపారు. 

అయితే అసలు తామెలాంటి నివేదికా ఇవ్వలేదని బీసీజీ తేల్చిచెప్పింది. మీడియాలో ప్రచారంలో ఉన్న నివేదికకు తమ ఆమోదం లేని పేర్కొంది. ‘భారత్, ప్రపంచానికి సంబంధించిగానీ లాక్‌డౌన్ పొడిగింపు విషయంలో మేం ఎలాంటి అంచనాలూ వేయలేదు. మా పేరుతో వస్తున్న వార్తలను నమ్మకండి’ అని తెలిపింది. భారత్‌లో జూన్ మూడో వారం వరకు లాక్‌డౌన్ ఉంటుందని బీసీజీ నివేదిక చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఏకంగా సెప్టెంబర్ వరకు కూడా లాక్‌డౌన్ అమలు చేస్తారని బీసీజీ చెప్పిందంటూ కథనాలు వెలువడ్డాయి. ఏపీ మూడు రాజధానుల వ్యవహారంలోనూ బీసీజీ నివేదికపై వివాదరం రేగడం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం చెప్పినట్లే బీసీజీ నివేదిక ఉందని విపక్షాలు ఆరోపించాయి. మొత్తానికి ప్రతిష్టాత్మక సంస్థగా భావించే బీసీజీ ప్రతిష్ట మాత్రం భారత రాజకీయాల వల్ల మసకబారిపోతోంది. అయితే కస్టమర్లు చెప్పినట్లు నివేదికలు ఇస్తుందని బీసీజీపై చాలా ఆరోపణలు ఉండడం గమనార్హం.