ఏపీలో కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కొన్ని ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కొందరు మంత్రులు మొదట జగన్‌కు నమస్కారం చేసి, తర్వాత గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపి వెళ్లిపోయారు. ఈ క్రమంలో మంత్రులు నారాయణ స్వామి, ఉషశ్రీ చరణ్‌లు సీఎం జగన్ కాళ్లు మొక్కారు. గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్‌లు మోకాళ్లపై కూర్చుని నమస్కరించారు. మంత్రి రోజా కాళ్లకు నమస్కరించి, అనంతరం ఆయన చేతిని ముద్దాడారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర సీనియర్ రాజకీయ నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ తన శైలిని చాటుకున్నారు. అందరు మంత్రుల మాదిరి కాకుండా ప్రమాణ స్వీకారం తర్వాత ముఖ్యమంత్రి జగన్‌ను దాటుకుంటూ గవర్నర్ వద్దకు వెళ్లారు. అనంతరం ముఖ్యమంత్రి వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి, చనువుగా భుజం తట్టారు. దాంతో ఎంతైనా బొత్స రూటే సెపరేటు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.