లాక్ డౌన్ కారణంగా ఐపీఎల్ తో సహా అన్ని క్రికెట్ మ్యాచులు రద్దైన సంగతి తెల్సిందే. దీంతో ఆటగాళ్లందరు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో ఉంటూ సరదాగా కుటుంబంతో గడపడంతో పాటు ఫిట్ నెస్ కోసం కసరత్తులు కూడా చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీమిండియా బౌలర్ మహమ్మద్ షమీ తన స్పీడ్ ను పెంచుకోవడానికి తన పెంపుడు శునకంతో పరుగుపందెంలో పాల్గొన్నాడు. ఈ పరుగు పందెంలో తన శునకం కంటే షమీనే ముందుండడం గమనార్హం. ‘స్పీడ్ వర్క్ విత్ జాక్’ అని క్యాప్షన్ తో షమీ దీనికి సంబంధిచిన వీడియోను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.