నిఖత్ జరీన్.. తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన ఈ అమ్మాయి పేరు వార్తల్లో మారుమ్రోగుతోంది. ఇస్తాంబుల్‌లో జరిగిన వుమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన ఈ అమ్మాయి.. ప్రపంచ బాక్సింగ్ వేదికపై మన దేశ త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా చేసింది. ఇది ఆరంభం మాత్రమేనని, రిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే తన లక్ష్యమని, దాని కోసం నిత్యం శ్రమిస్తూనే ఉంటానని చెప్పింది.
తాజాగా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హిజాబ్ వ్యవహారంపై నిఖత్ జరీన్ స్పందించారు. ‘‘హిజాబ్ ధరించడం అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. హిజాబ్ ధరించడంపై కామెంట్స్ చేయడం నాకు ఇష్టం లేదు. హిజాబ్ ధరించడాన్ని నేను ఇష్టపడతాను. హిజాబ్ విషయంలో తనకు కానీ, తన కుటుంబానికి కానీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. దుస్తుల విషయంలో నాకు నా కుటుంబ సభ్యులు స్వేచ్ఛనిచ్చారు. నా గురించి ఎవరు ఏమనుకుంటారో అనే విషయాన్ని నేను అస్సలు పట్టించుకోను’’ అని స్పష్టం చేశారు.
హిజాబ్ ధరించడంపై ఇటీవల దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో హిజాబ్ కారణంగా పెద్ద గొడవలే చోటుచేసుకోవడంతో అక్కడ కర్ఫ్యూ విధించారు. ఈ వివాదం ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.