"Boxing Champion" Nikhat Zareen was honored by TPCC
mictv telugu

బాక్సర్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ‎గా అవకాశం కల్పించాలి :రేవంత్ రెడ్డి

January 8, 2023

"Boxing Champion" Nikhat Zareen was honored by TPCC

రాజకీయాలకు అతీతంగా క్రీడాకారులని ప్రోత్సాహించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పీసీసీ ఆధ్వర్యంలో బాక్సింగ్ ఛాంపియన్, అర్జున అవార్డు గ్రహీత నిఖత్ జరీన్‌కు పార్టీనేతలతో కలిసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆమెకు పీసీసీ తరఫున రూ.5 లక్షల బహుమతి అందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జరీన్‎ను జనవరి 26 లోపు గ్రూప్ 1 అధికారిగా నియమించాలని కోరారు. డీఎస్పీ నిఖత్ జరీన్ కు ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద ఉన్న ప్రతిపాదనలను ఉన్నాయని తెలిపారు. అదే విధంగా నిఖత్ జరీన్‎కు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించి..అన్ని రకాల సౌకర్యాలతో స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయాలన్నారు. క్రీడాల్లో తమ కుమార్తెను ప్రోత్సాహించిన నిఖత్ జరీన్ తల్లిదండ్రులకు అభినందనలు చెప్పాలన్నారు.

విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని నింపేందుకు అందరూ కృషి చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. ఇందుకోసం నిఖత్‎కు గొప్పగా సన్మానించేలా కార్యక్రమం నిర్వహించుకోవాల్సినవసరం ఉందన్నారు రేవంత్. తనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడంపై బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. బహుమతిని ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారం ఉంటే క్రీడల్లో దేశం గర్వించేలా ముందుకెళతానని జరీన్ తెలిపారు. హైదరాబాద్ నిజాం క్లబ్‎లో జరిగిన ఈ సన్మాన కార్యక్రమానికి రేవంత్ రెడ్డితో పాటు షబ్బీర్ అలీ, మహేశ్ కుమార్ గౌడ్, అజారుద్దీన్, ఇతర నేతలు హాజరయ్యారు.