ఈరోజు స్కూల్స్, ప్రభుత్వ కార్యాలయాలు, కాలేజ్స్, బ్యాంకులు.. కొన్ని ప్రైవేట్ కంపెనీలకు హాలీడే. బాక్సింగ్ డే సందర్భంగా సెలవు అని అందరికీ తెలుసు. కానీ ఈ పండుగ ఎలా వచ్చింది? ఎందుకు జరుపుకొంటారో తెలుసుకోకపోతే ఎలా?
బాక్సింగ్ డే.. క్రిస్మస్ మరుసటి రోజు జరుపుకుంటారు. కానీ దీనికి క్రీడలకు ఎలాంటి సంబంధం లేదు. ఇది సాంస్కృతిక సెలవు దినం. చారిత్రాత్మకంగా ఇది పేదలకు బహుమతులు ఇచ్చే రోజు. కానీ ఆధునిక యుగంలో.. కుటుంబాలు కలిసి సమయాన్ని గడిపే ప్రభుత్వ సెలవు దినంగా జరుపుకొంటున్నారు. యునైటెడ్ కింగ్ డమ్, స్కాట్లాండ్, ఆస్ట్రేలియా, నైజీరియా, కెనడా, జర్మనీ, నార్వే ఇతర దేశాలతో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో అంటే మన దగ్గర కూడా బాక్సింగ్ డే జరుపుతున్నారు. దక్షిణాఫ్రికా ఇదే రోజును గుడ్ విల్ డేగా జరుపుకుంటుంది.
క్వీన్ విక్టోరియా హయాంలో 1800ల్లో బాక్సింగ్ డేకి ఆ పేరు వచ్చింది.
క్రిస్మస్ మరుసటి రోజు సంప్రదాయకంగా సంపన్న కుటుంబాలు తమ సేవకులకు బహుమతులు ఇచ్చేవారు. వారి యజమానులు క్రిస్మస్ రోజున ఎక్కువ పనులు చేయించుకునే వారు. అందుకే మరుసటి రోజు వారికి బహుమతులు, నగదు, మిగిలిపోయిన వస్తువులతో బాక్స్ లను లోడ్ చేసేవారు. అంతేకాదు.. ఆ రోజున పని వారికి సెలవుగా ప్రకటించేవారు. అలా వచ్చిన సెలవును చాలామంది నక్కల వేటకు వెళ్లడంగా పెట్టుకునేవారు. ఇప్పటికీ ఇదొక సంప్రదాయంగా కొన్ని గ్రామాల్లో జరుగుతున్నది. కొన్నిరోజులు షాపింగ్ చేసుకునే రోజుగా కూడా ఈ రోజును భావించేవారు.
స్పెయిన్ కి చెందిన గుర్రాల పోషకుడైన సెయింట్ స్టీఫెన్ తన విందు దినాన్ని డిసెంబర్ 26న జరిపేవాడు. అలా ఈ రోజుకు స్టీఫెన్స్ డే అని పేరు కూడా వచ్చింది. బాక్సింగ్ డే, సెయింట్ స్టీఫెన్స్ డే వేడుకల్లో గుర్రపు పందాలు, రగ్బీ ఆటలు ఆడుతుంటారు. క్రిస్మస్ మరుసటి రోజు అవసరమైన వారికి డబ్బు, ఆహారం లేదా ఇతర బహుమతులు ఇవ్వడాన్ని ‘బాక్సింగ్ డే’గా పేరు పెట్టడం జరిగింది. 1871 నుంచి ఈ రోజు బ్యాంక్ హాలీడేగా అన్ని దేశాలు ప్రకటించాయి.
ఇవి కూడా చదవండి :
300 కి.మీ.లు వీల్ చెయిర్ లో శబరిమలకు
ఈ విద్యార్థి కోసం నెలకు రూ.3లక్షలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం