ఆరేళ్ల పిల్లాడు అల్లా అన్నా.. టెర్రరిస్టేనా? - MicTv.in - Telugu News
mictv telugu

ఆరేళ్ల పిల్లాడు అల్లా అన్నా.. టెర్రరిస్టేనా?

December 4, 2017

అమెరికన్ల ఇస్లామోఫోబియోకు అద్దం పట్టే ఉదంతం ఇది. ఆరేళ్ళ వయసున్న మతిస్థిమితం లేని పిల్లవాడు అల్లాహ్, బూమ్ అనే పదాలు ఉచ్చరించాడని అమెరికా టీచర్ ఏకంగా పోలీసులను పిలిపించాడు. మొహమ్మద్ సులేమాన్ పుట్టినప్పుడే మానసిక సమస్యలతో వున్నాడని, అతనికి సరిగా మాట్లాడటం కూడా రాదనీ పిల్లాడి తండ్రి వాపోయాడు.

ఈ సంఘటన టెక్సాస్‌లోని హూస్టన్‌కు 20 మైళ్ళ దూరంలోని స్కూల్లో  జరిగింది. రెగ్యులర్ టీచర్ వెళ్ళిపోయాక  ప్రత్యామ్నాయ టీచర్ వచ్చాడు. ఆ సమయంలో పసివాడు.. తన ధోరణిలో అల్లా, బూమ్ అంటూ ఏవోవో మాట్లాడుతూ కనిపించాడు. అది చూసి టీచర్ అనుమానంతో  టెర్రరిస్టు అనుకున్నాడు.  పోలీసులకు కబురు చేశాడు. హుటాహుటిన వచ్చిన పోలీసులు ఆ పిల్లవాడిని విచారించి, భయపడాల్సిన అవసరం లేదని చెప్పడం కొసమెరుపు.