12 ఏళ్లు పిల్లాడు.. సెక్స్ కోసం 21 ఏళ్ల యువతిపై వేధింపులు! - MicTv.in - Telugu News
mictv telugu

12 ఏళ్లు పిల్లాడు.. సెక్స్ కోసం 21 ఏళ్ల యువతిపై వేధింపులు!

May 22, 2020

boy blackmail woman with her morphed photos

డిజిటల్ విప్లవంలో మరో చీకటి కోణం ఇది. పట్టుమని 12 ఏళ్లు కూడా లేని బాలుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని 21 ఏళ్ల యువతి పోలీసులను ఆశ్రయించింది. తన ఫొటోలను నగ్నంగా మార్చి, సెక్స్ చాట్ చేయాలని వేధిస్తున్నాడని, లేకపోతే డబ్బులు ఇవ్వాలని బెదిరిరిస్తున్నాడని వాపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. 

బాధితురాలు తెలిపిన వివరాలు ప్రకారం.. 6వ తరగతి చదువుతున్న బాలుడు టెలిగ్రాం యాప్‌లోని స్టూడెంట్ గ్రూప్ ద్వారా ఓ యువతిని పరిచయం చేసుకున్నాడు. అక్కా అక్కా అంటూ మాటలు కలిపాడు. తర్వాత కామావతారం ప్రదర్శించాడు. ఆమె ఫోటోలను మార్ఫ్ చేసి ఆమెకే పంపాడు. పచ్చి బూతులతో మెసేజీలు కుమ్మరించాడు. తనతో సెక్స్ చాట్ చేసి కోరికలు తీర్చలని, లేకపోతే అందరికీ షేర్ చేస్తానని బెదిరించాడు. ఆమె అతడు పంపిన మెసేజీలను స్క్రీన్ షాట్స్ తీసి కవినగర్ పోలీసులకు అందజేసింది. పోలీసులు బాలుడిని విచారించగా, తాను పంపలేదన్నాడు. తమ ఫోన్ బహుశా హ్యాక్ అయ్యుంటుందని అతని తల్లిదండ్రులు కూడా వెనకేసుకొచ్చారు. టెలిగ్రాం యాప్ ద్వారా బాలుడు ఆ యువతి ఫోన్ నంబర్ తీసుకుని వేధించినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఐపీ అడ్రస్ ఆధారంగా విచారణ సాగిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు ఇచ్చి వదిలేయకుండా వాళ్లేం చేస్తున్నారో నిఘా వేసి ఉంచాలని కోరతున్నారు.