అమ్మాయి చేతిలో ఓడినందుకు ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మాయి చేతిలో ఓడినందుకు ఆత్మహత్య

July 19, 2019

Boy defeated by girl.

సమాజంలో ఆడపిల్లలపై వివక్ష ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో దారుణాలకు, విషాదాలకు కారణం అవుతోంది. అడపిల్ల చేతిలో ఓడియానని బాధపడిన ఓ బాలుడు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో ఈ విషాదం చోటుచేసుకుంది. 

సాయిచరణ్ అనే విద్యార్థి స్థానిక కృష్ణవేణి పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. తరగతిలో గతవారం క్లాస్ లీడర్ ఎన్నిక జరిగింది. ఓ అమ్మాయి, సాయిచరణ్ పోటీ పడగా విద్యార్థులు అమ్మాయిని గెలిపించారు. ఆడపిల్ల చేతిలో ఓడిపోయావంటూ కొందరు అతణ్ని సరదాగా ఏడిపించారు. అయితే సాయి దీన్ని తీవ్రంగా తీసుకుని మనస్తాపంతో గురువారం సాయంత్రం ఇంట్లోంచి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతగ్గా..పట్టణ శివారులోని రైలు పట్టాలపై అతని మృతదేహం కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.