బోరు బావిలో పడ్డ బుడ్డోడు సేఫ్..! - MicTv.in - Telugu News
mictv telugu

బోరు బావిలో పడ్డ బుడ్డోడు సేఫ్..!

August 16, 2017

నిన్న మధ్యాహ్యం బోరు బావిలో పడిన చిన్నోడు చంద్రశేఖర్ మృత్యుంజయుడై బైటికి వచ్చాడు.దాదాపు పది,పదకొండు  గంటలకు పైగా 15 అడుగుల లోతులో చిక్కుపోయిన  చందూ ఎట్టకేలకు 400 మంది కష్టంతో చిన్న గాయంకూడా కాకుండా బైటికి వచ్చాడు.

వినుకొండ మండలం ముమ్మడివరంలో మంగళవారం మద్యాహ్నం రెండేన్ల పిల్లోడు చందూ ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు ,ఇది గమనించిన తల్లి…ఏడుస్తూ ఏం చెయ్యాలో తెలీక భర్తకు చెప్పడంతో…విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు,వెంటనే రంగంలోకి దిగిన  ఎన్డీఆర్ ఎఫ్ రెస్కూ ఆపరేషన్ దాదాపు 11 గంటల పాటు జరిగింది,15 అడుగుల లోతులో బాలుడు చిక్కుకుపోయాడని గమనించిన అధికారులు మొదట రోబటిక్ హ్యాండ్స్ తో పిల్లాడిని బయటకు తీద్దామని ప్రయత్నించారు కానీ అది సఫలం కాకపోవడంతో ..బోరు బావికి సమాంతరంగా 20అడుగులో లోతులో గొయ్యిని తవ్వారు,మధ్యలో సున్నపు రాయి అడ్డం రావడంతో కొంత అంతరాయం కల్గింది,ఆ తరువాత వర్షం పడడం..పిల్లవాడిని బయటకు తీసేందుకు అంతరాయం కలిగించినా కూడా అధికారులు ,పోలీసులు  ఏమాత్రం వెనక్కి తగ్గకకుండా పిల్లాడిని కాపాడారు.11 గంటలూ పిల్లవాడికి మీదికెల్లి పైప్ ద్వారా ఆక్సిజన్ అందించారు.దాదాపు ఈ రెస్కూ ఆపరేషన్ లో 400 మంది పాల్గొన్నారు,కలెక్టర్,స్ధానకి ఎమ్మెల్యే,మంత్రి కూడా    పిల్లాడిని బయటకు తీసేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు.

ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రజలు,చిరంజీవిగా బాలుడు బయటకు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ ఉన్న ప్రజలు బాలుడ్ని చూ డగానే ఒక్క సారిగా ఈలలు, చప్పట్లతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.

చిన్నారి చందుకు 108 సిబ్బంది ప్రాధమిక చికిత్స అనంతరం బాలుడిని తల్లి అనూషకు అప్పగించారు. తల్లి తన బిడ్డని మరలా చూస్తామో లేదో అనుకున్నామని నా బిడ్డను కాపాడిన వారందరికీ కృతఙ్ఞతలు తెలిపింది. బాబు ఆరోగ్యం గా ఉన్నాడు. మృత్యువు ని జయించిన చందు చక్కగా ఆడుకుంటున్నాడు.ఇలాంటి బోరు బావి ఘటనలు మళ్లీ జరగకుండా ఇటు తల్లిదండ్రులు,అటు అధికారులు అప్రమత్తంగా ఉండి తెరిచి ఉన్న బోరు బావులను వెంటనే మూసేసి,బోరు బావులకు బలైపోతున్న చిన్నారులను కాపాడుకుందాం.