పైనుంచి పడుతున్న చిన్నారిని క్యాచ్ పట్టుకున్నారు(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

పైనుంచి పడుతున్న చిన్నారిని క్యాచ్ పట్టుకున్నారు(వీడియో)

December 3, 2019

Boy Falls.

ఆపద్బాంధవులు అంటారు కదా.. వీళ్లను చూస్తే వారే వీరని అనిపిస్తారు. ఆపదలో ఉన్నవాళ్లను ఆదుకోవాడానికి ఇలాంటివాళ్లు ఉన్నారేమో అనిపిస్తుంది. ఈ చిన్నోడికి కూడా ఆయిశ్శు గట్టిగా ఉన్నట్టుంది. మూడు అంతస్థుల మేడ పైనుంచి పడ్డాడు. సమయానికి ఈ ఆపద్బాంధవులు అక్కడికి వచ్చి పైనుంచి పడుతున్న చిన్నారిని దోసిళ్లతో పట్టుకుని కాపాడారు. ఈ ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. 

ఓ పిల్లాడు మూడు అంతస్థుల భవనం పైకి ఎక్కి ప్రమాదవశాత్తు జారాడు. ఆ పిల్లాడు కిందపడేలా ఉండటాన్ని కింద వెళ్తున్న ఓ కుర్రాడు చూశాడు. వెంటనే గట్టిగా అరిచాడు. అతని అరుపులు విని చుట్టూ ఉన్న జనం గబగబా అక్కడకు వచ్చారు. పిల్లాడు కింద ఎక్కడ పడతాడో కరెక్టుగా అక్కడ నిలబడి చేతులు చాచారు. అంతే క్షణాల్లో దబ్బున కింద పడ్డాడు. దూసుకువస్తున్న బంతిని క్రికెటర్ క్యాచ్ పట్టుకున్నట్టు బాబును కింద పడనీయకుండా చేతుల్లో పట్టుకున్నారు. దీంతో ఆ చిన్నోడికి ఎలాంటి గాయాలు కాకుండా.. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ వీడియో చూస్తే నిజంగా క్యాచ్ పట్టుకున్నవారిని తప్పకుండా అభినందిస్తారు.