క్యూటెస్ట్ బాయ్‌కి కేటీఆర్ ఫిదా.. - MicTv.in - Telugu News
mictv telugu

క్యూటెస్ట్ బాయ్‌కి కేటీఆర్ ఫిదా..

November 30, 2017

జీఈఎస్ సదస్సుకు వచ్చిన అతిథుల కోసం బుధవారం రాత్రి గోల్కొండ కోటలో ప్రభుత్వ నోరూరించే విందు ఇచ్చింది. పలు దేశాల అతిథులు కోట అందాలను చూస్తూ ముగ్ధులయ్యారు. అమెరికా అధినేత కూతురు ఇవాంకా కూడా వావ్ అంటూ చప్పట్లు కొట్టింది. అతిథులందరూ సంబరాల్లో మునిగి తేలారు.అయితే ఐటీ మంత్రి కేటీఆర్ కళ్లకు మాత్రం ఓ పసిబిడ్డే అందానికి అందంలా కనిపించాడు. అంతే.. చప్పున  ఆ పాలుగారే పసివాడిని ఆమె తల్లి చేతుల్లోంచి తీసుకుని ముద్దాడాడు. ఎత్తుకుని లాలించాడు. అందరూ విందు, గానాబజానాల్లో ఉండగా కేటీఆర్ మాత్రం ఆ బుజ్జాయి ముద్దుమోముకు, నవ్వులకు ప్లాట్ అయిపోయి వాడితో ఆడుకున్నాడు.. వాడు కూడా తెగ చిర్నవ్వులు చిందిస్తూ..గారాలు పోయాడు.. అక్కడున్న వారందర్నీ కట్టిపడేశాడు..ఆ చిన్నోడి పేరు అలీ. సదస్సు కోసం ఇజ్రాయెల్‌లోని జెరూసలేం నుంచి వచ్చిన ఒక మహిళా పారిశ్రామికవేత్త కొడుకు. ఈ వివరాలను, ఫొటోలు కేటీఆర్ ట్వీట్ చేశాడరు. అందాలు చిందే అలీతో హాయిగా గడిపానని తెలిపారు.