తల్లికి రెండో పెళ్లి చేసిన కుమారుడు - MicTv.in - Telugu News
mictv telugu

తల్లికి రెండో పెళ్లి చేసిన కుమారుడు

September 13, 2021

pelli

వినూత్న ఆలోచనలతో ఈనాటి తరం దూసుకెళ్ళుతోంది. పెద్ధ వాళ్ళు సైతం తీసుకోలేని నిర్ణయాలను సాహసోపేతంగా తీసుకొని అమలుపరుస్తున్నారు. అలాంటి ఒక సంఘటనే తమిళనాడులో జరిగింది. మదురై జిల్లా తెన్ కాశీకి చెందిన సుభాషిణి అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.

pelli

ఆమెకు ఇప్పటికే వివాహమై విడాకులు పొందారు. ఈమెకు దర్శన్ అనే తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో ఆమె తిరుమంగళానికి చెందిన సినిమా రంగంలో పనిచేసే చిత్రకారుడు ఆదిష్‌తో ప్రేమలో పడింది. ఇరువురూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరి ప్రేమ వివాహానికి ఇరు కుటుంబాల వారు సమ్మతించలేదు. కానీ సుభాషిణి కుమారుడు దర్శన్ మాత్రం పూర్తిగా సమ్మతిస్తూ వారి వివాహానికి మద్ధతు తెలిపాడు. తన తల్లి సుఖంగా ఉండాలని పెద్ద అరిందాలా చెప్పాడు. తన చేతుల మీదుగా మంగళసూత్రం అందించి తన తల్లి ప్రేమ వివాహం జరిపించి అందరి మన్ననలు పొందాడు. చిన్నవయసులో పెద్దమనసుతో తల్లి ఆనందం కోసం దర్శన్ చేయూత ఇవ్వడం స్థానికులను, నెటిజన్లను ఆకట్టుకుంటోంది.