తండ్రి ద్వారా పిల్లాడికి హెచ్‌ఐవీ వైరస్

నాలుగేళ్ల బాలుడికి అరుదైన పరిస్థితి ఎదురైంది. తన తండ్రికి తగిలిన గాయం నుంచి కారిన రక్తంతో శిశువుకు ఏయిడ్స్ వ్యాధి సోకింది. ఈ విషయాన్ని వైద్యులు పేర్కొన్నారు. దీనిపై పోర్చగల్‌లోని లిస్భన్ విశ్వవిద్యాలయం బృందం వైద్య పరిశోధన చేస్తోంది. జన్యు, వంశ సంబంధ పరిశీలను చేసిన వారికి అసలు విషయం బయటపడింది. తండ్రీబిడ్డలకు పరీక్షలు చేసిన దరిమిలా శాస్త్రవేత్త బాబు పుట్టిన సమయంలో తండ్రి నుంచి వ్యాధి సోకిందని పేర్కొన్నారు.Boy Infected With HIV From Tainted Fatharతండ్రికి ఒకప్పుడు పొంగు వ్యాధి సోకడం, పొక్కుల్లా వ్యాపించడం, ఇతర పరిస్థితుల కారణంగా అనారోగ్యం పాలయ్యాడు. దాని ఫలితంగా శరీర భాగాల్లో ఏర్పడిన స్రావం అంటుకొని, బాలుడు కూడా హెచ్‌ఐవీ బాధితుడయ్యాడని పరిశోధకులు తేల్చారు. వివిధ పరిస్థితిలో తల్లిదండ్రలు శరీరం నుంచి వెలువడే ద్రవ పదార్థాలు నుంచి పిల్లలకు వివిధ రకాలు వ్యాధులుగా మారుతాయని అమెరికాకు చెందిన ప్రొఫెసర్‌ థామస్‌ హోప్‌ తెలిపారు. ఎయిడ్స్‌ వ్యాధి ప్రాణాంతకైన వ్యాధి కాదు. దీర్ఘకాలికంగా మందులను వాడడం వల్ల వ్యాధిని నియంత్రించవచ్చు. అయితే పసిబిడ్డకు తండ్రి నుంచే ఆ తరహా విపత్కర‌స్థితి ఎదురుకావడాన్ని వైద్యపరంగా మరింత పరిశోధించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.