డబ్బు కోసం దుండగులు పసిపిల్లలపై పంజా విసురుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఓ బాలుడిని కొందరు మంగళవారం కిడ్నాప్ చేశారు.
రూ. 5 లక్షలు ఇస్తేనే వదిలి పెడతామని చెబుతున్నారు. వండర్ కిడ్స్ స్కూల్లో చదువుతున్న నాలుగేళ్ల శ్యామ్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. శ్యామ్ తండ్రికి రోడ్డు ప్రమాదం జరిగిందని, ఆ చిన్నారిని తీసుకెళ్లాలని స్కూలు వారికి చెప్పి పిల్లాడిని తీసుకెళ్లారు. తర్వాత అతని తల్లిదండ్రులకి ఫోన్ చేసి, డబ్బులిస్తేనే శ్యామ్ ను వదిలేస్తామని లేకపోతే చంపేస్తామని బెదిరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాపర్లు భీమవరం చుట్టుపక్కలే ఉండొచ్చని అనుమానిస్తున్నారు.