తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట బాలుడి కిడ్నాప్ - MicTv.in - Telugu News
mictv telugu

తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట బాలుడి కిడ్నాప్

May 2, 2022

తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఆదివారం సాయంత్రం ఐదేళ్ల బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. బాలుడు ఆలయం ఎదురుగా కూర్చొని ఉండగా, ఓ మహిళ వచ్చి బాలుడిని తీసుకెళ్లింది. ఈ దృష్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ విషయం బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బయటపడింది. సీసీ కెమెరాల ఆధారంగా విచారించిన పోలీసులు బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ తిరుపతికి వెళ్లే ఏపీ 03 జెడ్ 0300 నెంబరు బస్సు ఎక్కిందని గుర్తించారు. బాలుడి పేరు గోవర్ధన్ రాయల్ అని, వారి కుటుంబం తిరుపతిలోని దామినీడులో నివసిస్తోందని పోలీసులు తెలిపారు. కాగా, బాలుడి కిడ్నాప్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.