వరద నీటిలో పడి మూడేళ్ళ బాలుడు మృతి.. - MicTv.in - Telugu News
mictv telugu

వరద నీటిలో పడి మూడేళ్ళ బాలుడు మృతి..

October 14, 2020

Boy passed away in hyderabad sellar water

హైదరాబాద్ లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. నగరంలోని అపార్ట్మెంట్ లలోని సెల్లార్ లలోకి వరద నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో దిల్ సుఖ్ నగర్ సాహితీ అపార్ట్ మెంట్ లో దారుణం జరిగింది. ఆ అపార్ట్మెంట్ సెల్లార్ లోకి వచ్చి చేరిన వరద నీటిలో అజిత్ సాయి అనే మూడేళ్ళ బాలుడు పడి చనిపోయాడు. 

ఉదయం అజిత్ సాయి ఆడుకుంటూ కిందకు వెళ్లి నీటిలో పడిపోయాడు. ఆలస్యంగా గమనించిన తండ్రి యుగేందర్ బాబుని బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకునే లోపే బాలుడు మరణించినట్టు వైద్యులు తెలిపారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.