పబ్‌జీ పాడుగాను.. ఆటలో పడి అన్నం తినలేదు.. చివరకు ఇలా - MicTv.in - Telugu News
mictv telugu

పబ్‌జీ పాడుగాను.. ఆటలో పడి అన్నం తినలేదు.. చివరకు ఇలా

August 14, 2020

Boy Playing Pubg

పబ్‌జీ ఆటకు బానిసై చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రతిక్షణం అదే పనిగా ఆడుతూ డబ్బులు, జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. ఏపీలోనూ ఇలాంటి విషాదకర ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఈ గేమ్ ఆడుతూ.. అన్నం తినడం మానేసిన ఓ 16 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని జాజులకుంట గ్రామంలో జరిగింది. దీంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 

చాలా రోజులుగా ఆ బాలుడు పబ్జీ గేమ్ ఆడుతూ అందులోనే గంటల కొద్ది గడిపేవాడు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినిపించుకునే వాడు కాదు. సమయానికి తినడం, మంచి నీళ్లు కూడా తీసుకోవడం మానేశాడు.  దీంతో ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స తీసుకుంటూ చనిపోయాడు. ఎక్కువ సమయం ఆహారం, మంచినీరు తీసుకోకపోవడంతో హైడ్రేషన్‌కు కారణంగా డయేరియా బారిన కూడా పడ్డాడని వైద్యులు తెలిపారు. ఆన్‌లైన్ గేమ్ విషయంలో తల్లిదండ్రులు పిల్లలపై దృష్టిసారించాలని చెబుతున్నారు. ఎవరైనా ఆటలకు ఎక్కువగా బానిసైతే వెంటనే వారిని వైద్యుల వద్దకు తీసుకెళ్లడమే ఉత్తమమని అంటున్నారు.