విశాఖలో విషాదం.. కారు డిక్కీలో బాలుడి బలి - MicTv.in - Telugu News
mictv telugu

విశాఖలో విషాదం.. కారు డిక్కీలో బాలుడి బలి

May 20, 2019

పెద్దల నిర్లక్ష్యం పిల్లల ప్రాణాలు తీస్తోంది. కారు డిక్కీలో చిక్కుకుపోయిన ఓ బాలుడు ఊపిరాడక కన్నుమూశాడు. విశాఖపట్నంలోని మాల్కాపురం నేవల్ పార్క్స్ క్వార్టర్స్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది.

Boy suffocated to death in car dikki in Visakhapatnam returning after vehicle servicing center with father.

ప్రేమ్‌కుమార్ అనే 8 ఏళ్ల బాలుణ్ని అతని తండ్రి ఈ రోజు కారు సర్వీసింగ్‌ సెంటర్‌కు తనతోపాటు తీసుకెళ్లాడు. సర్వీసింగ్ చేయించుకుని ఇంటికి వచ్చారు. సాయంత్రం ప్రేమ్‌కుమార్‌ కనిపించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు.  ఎక్కడా కనిపించకపోవడంతో కారులో వెతగ్గా డిక్కిలో విగతజీవిగా కనిపించాడు. దీంతో కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. బాలుడు ఎవరికీ తెలియకుండా డిక్కీలోకి వెళ్లి, బయటికి వచ్చే మార్గం లేక ఊపిరాడక చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు.