దొంగలపై తిరగబడిన ఐదేళ్ల పిల్లోడు.. (వీడియో)  - MicTv.in - Telugu News
mictv telugu

దొంగలపై తిరగబడిన ఐదేళ్ల పిల్లోడు.. (వీడియో) 

October 13, 2020

పిల్లలను లైట్ తీసుకోకూడదు. కిలకిలా నవ్వుతూ, లేకపోతే పైకప్పు ఎగిరిపోయేలా ఏడుస్తూ సందడి చేసే పిల్లలు అవసరమైతే ఉగ్రరూపం దాల్చి చిచ్చరపిడుగుల్లా చెలరేగిపోతారు. ఎదుటున్నవాడు ఎవడైనా సరే కుమ్మిపారేస్తారు. సైజ్ ముఖ్యం కాదు భయ్యా, కొట్టామా లేదా అన్నదే ముఖ్యం అని పంచ్‌లు విసురుతారు. అలాంటి సంఘటనొకటి అమెరికాలో జరిగింది. ఇంట్లోకి చొరబడి దోపిడీ దొంగలపై ఓ ఐదేళ్ల బుడతడు బీభత్సంగా తిరగబడ్డాడు. 

Can you identify these home invasion suspects?

PLEASE SHARE: We need your help identifying these individuals responsible for a home invasion. On September 30 around 10:30AM, officers were called to the 500 block of S. Grant in reference to shots fired. When they arrived, they learned there was a home invasion. Four males, all with hoodies on, knocked on the front door. A juvenile occupant opened the door and the four males forced themselves inside. At least three of the four were armed with handguns. The suspects fled the scene and more shots were fired. Luckily, no one was physically injured. This video is extremely disturbing. You can see a little boy hitting one of the armed suspects as he tries to defend his home. It is our job now to defend him. If you have any information on who these men are, please call Michiana Crime Stoppers at 574-288-STOP or 800-342-STOP. You can also call our South Bend Police Department Investigative Bureau at 574-235-9263.

Publiée par South Bend Police Department sur Vendredi 9 octobre 2020

ఇండియానాలోని సౌత్‌బెండ్‌లో టామికా రీడ్ అనే మహిళ నివసిస్తోంది. ఆమె కుటుంబ సభ్యులతో కలసి హాల్లో ఇస్త్రీ చేస్తుండగా దొంగలు చొరబడ్డారు. తుపాకులు తీసి బెదరించారు. టామికాను, ఆమె కూతురును పట్టుకున్నారు. ఇక దోపిడీకీ తెరతీయబోతుండగా టామికా చిన్నకొడుకు ఐదేళ్ల డేవిడ్ జాన్సన్ తిరబడ్డాడు. తొలుత ఓ బొమ్మతో ఓ దొంగోణ్ని కొట్టాడు. తర్వాత అటూ ఇటూ చూసి ఏమీ దొరక్కపోవడం ఉట్టి చేతులతో దొంగలను తన్నేశాడు. పిల్లాడు కదా అని వాళ్లు తొలుత పట్టించుకోలేదు. మనోడు చెలరేగిపోయేసరికి ఇక అయ్యేపని కాదులే అని వెళ్లిపోయారు. ఈ సీన్ సీసీ కెమెరాలో రికార్డయింది. పోలీసులు దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో కుర్రాడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. జాన్సన్‌కు గోల్డ్ స్టార్ అనే శౌర్యపతకం ఇస్తామని చెప్పారు.