boyfriend dumped his girlfriend in madhya pradesh
mictv telugu

పెళ్లి చేసుకోమన్నందుకు ప్రేయసిని దారుణంగా కొట్టేశాడు.. వీడియో

December 24, 2022

ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోమని చెప్పడమే పాపమైపోయింది. ఆ మాత్రం దానికే ప్రియుడు యువతిని దారుణంగా కొట్టేశాడు. జుట్టు పట్టి లాగి కిందపడేసి కాలితో నిర్దాక్షిణ్యంగా పలుమార్లు తన్నాడు. కాలిపై, మొఖంపై బలంగా కాలితో కొట్టడంతో యువతి సొమ్మసిల్లిపోయింది. మధ్యప్రదేశ్ రేవా జిల్లాలో జరిగిన ఈ ఘటన వైరల్ కావడంతో పోలీసులు యువకుడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వీడియో ప్రకారం.. రోడ్డుపై ఓ యువ జంట నడచి వెళ్తుండగా, తనను పెళ్లి చేసుకోమని యువతి ప్రియుడిని అడుగుతుంది. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యువకుడు.. మొదట చెంపపై కొట్టి, జుట్టు పట్టుకొని కిందపడేస్తాడు. అనంతరం కాలితో యువతి కాలిపై పలుమార్లు తన్ని తర్వాత మొఖంపై బలంగా తన్నాడు. యువతి తీవ్రంగా గాయపడగా, అక్కడే ఉన్న స్థానికులు ఎవరూ ఆపకపోగా తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీస్తూ ఉండిపోయారు. ఒక్కరు కూడా కాపాడడానికి లేదా వారించడానికి ముందుకు రాలేదు. అనంతరం సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేయగా, వైరల్ అయింది. స్పందించిన రేవా పోలీసులు సుమోటో కేసు నమోదు చేసి జంటను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. దాడి చేసిన యువకుడిని అరెస్ట్ చేసేందుకు చూస్తున్నారు.