‘గ్యాంగ్ రేప్ చేద్దామ’న్న బాలుడు 11 అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

‘గ్యాంగ్ రేప్ చేద్దామ’న్న బాలుడు 11 అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య

May 6, 2020

Boys Locker Room in Delhi

గ్యాంగ్ రేప్ ఎలా చేయాలో బాయ్స్‌ లాకర్‌ రూమ్ పేరిట ఓ గ్రూప్‌లో చాటింగ్ చేసిన 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఏకంగా 11వ అంతస్తు నుంచి కిందకు దూకి మరణించాడు. ఢిల్లీలోని గురుగ్రామ్ చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మైనర్ పిల్లలు ఈ విధంగా చాటింగ్ చేసుకోవడంతో అంతా ఖంగుతిన్నారు.  ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

30 మంది విద్యార్థులు ఇటీవల ఓ అమ్మాయిపై గ్యాంగ్ రేప్ చేసే అంశంపై చర్చించుకున్నారు. అసభ్యకరమైన ఫొటోలు పంపుకున్నారు. ఈ విషయం బయటకు రావడంతో 16 ఏళ్ల విద్యార్థిని పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈవిషయం తెలిసిన వెంటనే తోటి స్నేహితులు ఆ బాలుడికి విషయం చెప్పారు. అతని ఇంటికి పోలీసులు వస్తున్నారని చెప్పడంతో పరువు పోతుందనే ఆందోళనతో బిల్డింగ్ ఎక్కి కిందకు దూకాడు. పెద్ద శబ్ధం రావడంతో అపార్ట్‌మెంట్‌లో ఉన్న వారు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది.