బ్రహ్మానందం ఆస్తులు 320 కోట్లు.. - MicTv.in - Telugu News
mictv telugu

బ్రహ్మానందం ఆస్తులు 320 కోట్లు..

March 3, 2018

మూడు దశాబ్దాలుగా వెండితెరపై కడుపుబ్బా నవ్విస్తూ ప్రేక్షకాదరణ పొందిన ప్రముఖ హాస్యనటుడు ఆస్తులను కూడా బాగానే సంపాదించారు. ఆయన ఆస్తుల వివరాలు వెల్లడయ్యాయి. క్యాచ్ న్యూస్ అనే సంస్థ వివిధ అంచనాలతో ఆయన ఆస్తులను లెక్కగట్టింది. బ్రహ్మానందానికి మొత్తం రూ. 320 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని తెలిపింది. ఇందులో స్థిర చరాస్తులు, కార్లు వంటివి ఉన్నాయి.

1000కిపైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం భారీ మొత్తంలో పారితోషకం తీసుకుంటారు. ఆయన సినిమాకు ఇంత అని కాకుండా రోజుకు రూ. 3 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటారని ఫిలింనగర్ టాక్. ఈ లెక్కన ఆయన ఒక్కో సినిమాకు రూ. 1 కోటి రూపాయలు పుచ్చుకుంటారని చెబుతున్నారు.

అలాగే, టాలీవుడ్ నుంచి అత్యధిక మొత్తంలో ఆదాయ పన్ను చెల్లించిన కమెడియన్లలో ఆయనే అగ్రస్థానం. బ్రహ్మానందానికి రెండు తెలుగు రాష్ర్టాలో ఖరీదైన స్థలాలు, భవనాలు, ఆడి R8, ఆడి Q7 మరియు మెర్సిడెస్-బెంజ్ (బ్లాక్) వంటి వాహనాలు ఉన్నాయి.  బ్రహ్మానందం ఎక్కడా దురాబా ఖర్చు చేయరని, పొదుపు విషయంలో ఆయనను చూసి నేర్చుకోవాలని సీనీజనం చెబుతుంటారు.