అదే కిక్, అదే పవర్.. సరిలేరు నీకెవ్వరు రాములమ్మా - MicTv.in - Telugu News
mictv telugu

అదే కిక్, అదే పవర్.. సరిలేరు నీకెవ్వరు రాములమ్మా

January 14, 2020

Vijayashanthi.

వయసు పెరిగినా ఆ పవర్, ఎనర్జీ, ఫైర్ ఏమాత్రం తగ్గనట్టే ఉన్నారు నటి విజయశాంతి. 13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మెరిశారు. ఈ చిత్రంలో తన గత చిత్రాల్లో మాదిరి మంచి పవర్‌ఫుల్ పాత్రలో మెరిశారు. అయితే విజయశాంతి చిత్రం షూటింగ్ సందర్భంగా తీసిన ఓ వీడియోను డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్విటర్‌లో షేర్ చేశాడు. ఇందులో సినీ నటుడు బ్రహ్మాజీకి విజయశాంతి కిక్ ఇస్తున్నారు. 

కాలు ఎగరేసి తన్నడంలో కర్తవ్యం సినిమా పోరాట దృశ్యాలను గుర్తుకుతెచ్చారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి ట్విటర్‌లో స్పందిస్తూ, ‘13 ఏళ్ల తర్వాత అద్భుతంగా పునరాగమనం చేశారు. మాస్టర్ కిక్’ అని పేర్కొన్నాడు. విజయశాంతికి భోగి శుభాకాంక్షలు తెలిపాడు. కాగా, ఈ వీడియో చూసిన నెటిజన్లు లేడీబాస్, రాములమ్మ కిక్ అదిరింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘అదే కిక్, అదే పవర్.. సరిలేరు నీకెవ్వరు రాములమ్మా’ అని మరో అభిమాని కామెంట్ చేశాడు.