కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న రంగమార్తండ సినిమా మీద అంచనాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న గురించి మెగాస్టార్ చిరంజీవితో మాట్లాడించారు. చాలా ఎమోషనల్ గా మాట్లాడిన చిరు డైలాగులకు అందరూ ఫిదా అయిపోయారు. తర్వాత శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్ ల పాట ఒకటి వదిలారు. అది మంచి వ్యూస్ నే సంపాదించుకుంది. ఇప్పడు నిన్న బ్రహ్మానందం బర్త్ డే సందర్భంగా సినిమాలో ఆయన డైలాగ్ ఒకటి రిలీజ్ చేశారు. మనం ఎప్పుడూ చూడని బ్రహ్మానందాన్ని ఇందులో మనకు చూపించారు కృష్ణవంశీ. అప్పుడెప్పుడో చాలా ఏళ్ళ క్రితం బ్రహ్మీ ప్రధాన పాత్ర తెరకెక్కిన ఒక సినిమాలో తన నటనతో ఏడిపించారు. ఇప్పడు మళ్ళీ నిన్న వదిలిన గ్లింప్స్ చూస్తుంటే మళ్ళీ బ్రహా్మానందం ఏడిపించేలా ఉన్నారే అనిపిస్తోంది. చాలా ఎమోషనల్ గా, గద్గద స్వరంలో ఆయన చెప్పిన డైలాగ్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది.
రంగస్థల కళాకారుల జీవితాలే నేపథ్యంగా రంగమార్తాండ సినిమా తీస్తున్నారు కృష్ణవంశీ. ఇందులో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందు రాబోతోంది.
ఇవి కూడా చదవండి :
అవకాశాల్లేకనే ఇలాంటి డ్రెస్సా? కీర్తి సురేష్ మీద ట్రోలింగ్
మరోసారి మంచి మనస్సు చాటుకున్న మెగాస్టార్..