Brahmastra movie collected Rs.75 crores for First day
mictv telugu

‘బ్రహ్మస్త్ర’ తొలిరోజు వసూళ్లు.. పలు రికార్డులు బద్దలు

September 10, 2022

Brahmastra movie collected Rs.75 crores for First day

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన బ్రహ్మస్త్ర చిత్రం శుక్రవారం విడుదలైంది. రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా అమితాబ్ బచ్చన్, నాగార్జున, షారూక్ ఖాన్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది.

అయితేనేమి ఈ చిత్రం విడుదలైన తొలిరోజు రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 8 వేల స్క్రీన్లలో రిలీజవగా, తొలిరోజు రూ. 75 కోట్లు వసూలు చేసిందని నిర్మాత కరణ్ జోహార్ వెల్లడించారు. సెలవు రోజు కాకపోయినప్పటికీ ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇండియాలోనే రూ. 35 నుంచి 38 కోట్ల వరకు వసూలు చేసిందని టాక్. తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.7 కోట్ల గ్రాస్, రూ. 3.7 కోట్ల షేర్ వసూలు సాధించింది. దీంతో బాలీవుడ్ నుంచి తెలుగులోకి అనువాదమైన చిత్రాలలో మొదటి స్థానం సంపాదించింది. ఇంతకు ముందు అమీర్ ఖాన్ నటించిన ధూమ్ 3 చిత్రం రూ. 4.7 కోట్లు వసూలు చేసింది. తెలుగులో బ్రేక్ ఈవెన్ రావాలంటే ఈ చిత్రం ఇంకా 4.8 కోట్లను రాబట్టాల్సి ఉంది.