Brahmastra prerelease event cancelled
mictv telugu

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు నిరాశ.. ప్రిరిలీజ్ ఈవెంట్ రద్దు

September 2, 2022

Brahmastra prerelease event cancelled

బాలీవుడ్‌లో కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించిన భారీ బడ్జెట్ చిత్రం బ్రహ్మాస్త్ర. తెలుగులో బ్రహ్మాస్త్రంగా విడుదలవుతోంది. రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ఈ చిత్రంలో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం నచ్చడంతో రాజమౌళి సమర్పించడానికి ముందుకొచ్చారు.

ఈ నెల 9న విడుదలవుతోన్న ఈ చిత్రం తెలుగు వెర్షన్ ప్రిరిలీజ్ ఈవెంట్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో శుక్రవారం నిర్వహిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దీనికి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా వస్తున్నట్టు హైలెట్ చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు భారీగా చేరుకున్నారు. అయితే చివరి నిమిషంలో పోలీసులు అనుమతులు రద్దు చేయడంతో ఈవెంట్ క్యాన్సిల్ చేసినట్టు చిత్ర బృందం ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతూ ట్విట్టర్ వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అటు ఇటీవల అమిత్ షా ఎన్టీఆర్‌ను కలవడంతో రాజకీయ కోణం చేరి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో పోలీసులు అనుమతి రద్దు చేసినట్టు తెలిసింది. ఇక తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. ప్రిరిలీజ్ ఈవెంటును హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో రాత్రి 8 గంటలకు నిర్వహిస్తున్నట్టు సమాచారం.