అద్భుతం..ఈ విషయంలో డాక్టర్లు దేవుళ్లే..!
బ్రెయిన్ డెడ్ అంటే ఇక ఆ మనిషి పని అయిపోయిందానుకుంటాం.ఉన్నంతాకాలం కోమాలో ఉండాల్సిందే. వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తుంటారు. కానీ ప్రెగ్నెంట్ మహిళ బ్రెయిన్ డెడ్ అయితే..?ఆమె కడపులో కవల పిల్లలు ఉంటే..డాక్టర్లు ఏం చేస్తారు..?
ఆమెకు బ్రెయిన్ డెడ్ అయింని, బతకదని డాక్టర్లు చెప్పేశారు. కానీ కడుపులో ఉన్న కవల పిల్లలకు ప్రాణం పోయాలి..బ్రెయిన్ డెడ్ అయిన ఆమె చివరి కోరిక కూడా అదే..బ్రెయిన్ డెడ్ ప్రెగ్నెంట్ మహిళకు ఏడు నెలల చికిత్స అందించారు. చివరకు అద్భుతం జరిగింది. పండంటి కవలలకు ఆ మహిళ జన్మనించింది. నిజంగా ఈ విషయంలో డాక్టర్లు దేవుళ్లే కదా..
దక్షిణ బ్రెజిల్‌లోని నాసో సెనోరా డో రికో హాస్పటల్‌లో ఈ అద్భుతం జరిగింది. రెండు నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు ఫ్రాంక్లిన్ డీ సెల్వా జంపోలీ మెదడులో రక్తం గడ్డ కట్టింది. డాక్టర్లు ఆమె బ్రతకదని చెప్పేశారు. కానీ తన కడుపులో ఉన్న పిల్లలకు ప్రాణం పోయాలనుకున్న డాక్టర్లు ఆమెకు కోమాలోనే చికిత్స అందించారు. వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస అందించారు.
మొత్తం 123 రోజుల పాటు ఆమెకు అలా శ్వాస అందించారు. ఆ తర్వాత కవలలు పుట్టారు. వాళ్లు ప్రిమెచ్యూర్ ట్విన్స్ . వాళ్ల కోసం ఇప్పుడు డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. బ్రెయిన్ డెడ్ ప్రెగ్నెంట్ మహిళకు చికిత్సను అందిస్తున్న సమయంలో డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. శక్తివంతమైన ఔషధాలను కడుపులో పిల్లలకు చేరేలా చేశారు. డాక్టర్లు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధతో బ్రెయిన్ డెడ్ మహిళ పండంటి పిల్లలకు జన్మనించింది.