బ్రెయిన్‌డెడ్ అమ్మకు వందనం.. చనిపోతూ బిడ్డకు జననం.. - MicTv.in - Telugu News
mictv telugu

బ్రెయిన్‌డెడ్ అమ్మకు వందనం.. చనిపోతూ బిడ్డకు జననం..

September 4, 2019

Brain Dead....

తన ప్రాణాలు విడుస్తూ కూడా ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నైజీరియాలోని బర్నో రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. బ్రెయిన్ డెడ్ అయిన ఆ మహిళకు సుమారు 4 నెలలపాటు కృత్రిమ శ్వాస అందించిన వైద్యులు బిడ్డకు ప్రాణం పోశారు. చిన్నారి పుట్టిన తర్వాత కృత్రిమ శ్వాసను తొలగించడంతో ఆమె మరణించగా, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు డాక్టర్లు వెల్లడించారు. దీన్ని వైద్యరంగంలోనే అత్యంత అరుదైన ఘటనగా బర్నో యూనివర్సిటీ వైద్యులు చెబుతున్నారు. 

ఈ ఏడాది ఏప్రిల్‌లో చెక్ రిపబ్లికన్‌లోని బర్నో విశ్వ విద్యాలయం హాస్పిటల్‌లో చేరింది. అప్పటికే ఆ మహిళ 27 వారాల గర్భిణి కావడంతో కడుపులో ఉన్న బిడ్డను రక్షించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. కృత్రిమ యంత్రాలను ఉపయోగించి అవయవాలను పనిచేసేలా చేశారు. దీంతో కొన్ని రోజులకు కడుపులో ఉన్న బిడ్డలో ఎదుగుదల కనిపించింది. తమ ప్రయత్నాన్ని అలాగే సిజేరియన్ వరకు కొనసాగించి పురుడు పోశారు. సుమారు 117 రోజుల పాటు ఆ మహిళకు కృత్రి శ్వాస అందిస్తూ వైద్య పరికరాలను ఉపయోగించి బిడ్డకు ఊపిరి పోశారు. డాక్టర్లు చేసిన కృషికి పలువురు ప్రశంసలు కుపించారు.