షాకింగ్.. అక్కడ నీళ్లు తాగితే మెదడు పోతుంది..  - MicTv.in - Telugu News
mictv telugu

షాకింగ్.. అక్కడ నీళ్లు తాగితే మెదడు పోతుంది.. 

September 29, 2020

దాహం వేసింది కదా అని ఏ నీరు పడితే అది తాగుతున్నారా.? అయితే కొంచెం జాగ్రత్త. ఇలా చేయడం వల్ల మెదడు మీ మాయం అయిపోతుందట. భయానకమైన వైరస్ తలలోకి చేరి క్రమంగా మెదడును తినేస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఇలాంటి వింత వ్యాధిని వైద్యులు గుర్తించారు. దీంతో అక్కడి ప్రజలు మంచి నీరు తాగాలంటేనే భయపడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కరోనాతో వణికిపోతుంటే ఈ వింత వ్యాధి గురించి తెలిసి ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. 

జాన్సన్ ప్రాంతంలో ట్యాప్ వాటర్‌ తాగిన కొంత మంది ఇటీవల అనారోగ్యబారిన పడ్డారు. వీరిని పరీక్షించగా నెగ్లెరియా ఫోలరి అమీబా మెదడులోకి తినడం ప్రారంభించింది. నీటి ద్వారానే ఇది సోకిందని గుర్తించారు.  నీరు తాగినప్పుడు అమీబా ముక్కు నుంచి మెదడులోకి వెళ్లి క్రమంగా తినడం ప్రారంభిస్తుందని తెలిపారు. దీనికి సరైన సమయంలో చికిత్స అందించకపోతే మరణం హెచ్చరించారు. దీంతో లేక్ జాన్సన్ లోని ప్రజలు ఎవరూ కూడా టాప్ వాటర్ తాగొద్దని హెచ్చరికలు జారీ చేశారు. సాధారణంగా అన్ని రకాల నీళ్లలోనూ ఇవి ఉంటాయని పేర్కొన్నారు. దీని వల్ల  జ్వరం, వాంతులు, ఒళ్ళు నొప్పులు ఉంటాయని, కానీ ఇలా ఎందుకు జరుగుతుంతో తెలియడం లేదని పరిశోధకులు చెబుతున్నారు.