భ్రమరాంబకి ఆల్ ద బెస్ట్ ! - MicTv.in - Telugu News
mictv telugu

భ్రమరాంబకి ఆల్ ద బెస్ట్ !

July 8, 2017

టోటల్ చిన్న పిల్లలతో చాలా ప్రయోగాత్మకంగా చేస్తున్న ఇండిపెండెంట్ సినిమా ‘ భ్రమరాంబకి నచ్చేసాను ’ దిల్ రాజు గారి ‘ ‘ మా పల్లె ’ సంస్థ ’ ఆధ్వర్యంలో కార్తీక్ డైరెక్షన్ లో ఈ నెల 24 తారీకున ముహూర్తం జరుపుకొని తదుపరి రెగ్యులర్ షెడ్యూల్ పెట్టుకుంటున్నట్టు దర్శకుడు కార్తీక్ తెలిపారు.

అమెరికా నుండి వచ్చిన అబ్బాయికి – ఇక్కడ ఇండియాలో వున్న అమ్మాయికి ( భ్రమరాంబ ) మధ్య చిలిపి చిలిపిగా సాగుతూ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో, అందమైన లోకేషన్లలో ఎంతో ఆహ్లాదంగా సాగే ప్యూర్ మన ఇండియన్ కల్చర్, మన నేటివిటీతో, ఫన్ ను టచ్ చేస్తూ సాగే బ్యూటిఫుల్ ఫిల్మ్ ‘ భ్రమరాంబకి నచ్చేసాను ’. అమెరికాలో పుట్టి పెరిగినవారు ఇక్కడికొచ్చి మాట్లాడే ఇంగ్లీష్ కి పోటీపడి మనవాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ ఎలా వుంటుంది అనే చిన్న చిన్న ఫన్నీ సీన్స్ తో చిన్న పిల్లలతో సరదాగా సాగే సినిమా ఇది. క్రితా, సాత్విక్ అనే ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. త్వరలోనే షూటింగ్ కు వెళ్తున్నఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్.