ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం మరోసారి తాత అయ్యారు. ఆయన కుమారుడు, నటుడు రాజా గౌతమ్ దంపతులకు పండంటి ఆడశిశువు పుట్టింది. ఈ విషయాన్ని గౌతమ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంద్భంగా ఓ ఫోటోను షేర్ చేశాడు. అందులో తన కుమారుడు సోదరిని ప్రేమగా చూస్తూ కనిపించాడు. ఇది చూసిన బంధువులు, సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు పలువురు గౌతమ్ కు అభినందనలు తెలుపుతున్నారు. కాగా, పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ తర్వాత బసంతి, మను, చారుశీల వంటి విభిన్న చిత్రాలను చేశారు. అటు వయసు, ఆరోగ్య రీత్యా బ్రహ్మానందం సినిమాలను తగ్గించుకున్న విషయం తెలిసిందే.