Brand new Maruti Suzuki Third Gen Alto car under Rs.4 lakhs
mictv telugu

రూ. 4లక్షల్లోనే సరికొత్త మారుతీ సుజుకీ ఆల్టో కార్‌

August 3, 2022

 

మారుతీ సుజుకీ ఆల్టో కార్‌ ఫ్యాన్స్‌కు శుభవార్త. అతి త్వరలో మారుతీ సుజుకీ నుంచి సరికొత్త ఆల్టో కార్ రాబోతోంది. అది కూడా కేవలం రూ. 4లక్షల్లోనే. కొత్త ఆల్టో కారును ఈ నెలలోనే రిలీజ్ చేసేందుకు మారుతీ సుజుకీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ కార్ ఫోటో ఒకటి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.

రాబోయే కొత్త ఆల్టో కార్ హార్టెక్ట్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఉంటుందని అంచనా. ఇంజిన్ విషయంలో అతిపెద్ద అప్‌డేట్ ఉండొచ్చని భావిస్తున్నారు. మారుతీ సుజుకీ 2022 ఆల్టో కారులో 796cc మోటార్, 1.0 లీటర్ K10C Dual-Jet ఉంటాయని అంచనా. 48 bhp పవర్ ఔట్‌పుట్, 69Nm టార్క్ పవర్ ఔట్‌పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ స్టాండర్డ్‌గా అందుబాటులో ఉంటుంది. మరో గుడ్ న్యూస్ ఏంటంటే మారుతీ సుజుకీ థర్డ్ జెన్ ఆల్టో సీఎన్‌జీ వర్షన్ కూడా తీసుకురాబోతోంది. డిజైన్ అప్‌డేట్‌లలో ప్రధానంగా హ్యాచ్‌బ్యాక్ మునుపటి కంటే మరింత గుండ్రంగా ఉంటుంది. ప్రస్తుత సెలెరియో లాగానే హ్యాచ్‌బ్యాక్ ఉండే అవకాశం ఉంది. డాష్‌బోర్డ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త సీట్లు కూడా కనిపించబోతున్నాయి.

ఇప్పటికే ఉన్న ఆల్టో కారుతో పోలిస్తే 2022 మారుతీ సుజుకీ ఆల్టో ఫీచర్లు అధునాతనమైనవిగా, ఉన్నతమైనవిగా ఉండబోతున్నాయి. ఇందులో 7.0-అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేయగల ORVMలు ఉంటాయి. ధర విషయానికి వస్తే ఎక్స్ షోరూమ్ ధర రూ.4.10 లక్షల నుంచి రూ.4.80 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.