వీడేరా పోలీస్ అంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

వీడేరా పోలీస్ అంటే..

June 15, 2017

కేసు పెడితేగానీ పోలీసోళ్లు పట్టించుకోరు..యాక్సిడెంట్లని లైవ్ గా చూసినా… కేసు బుక్ అయ్యగానే జోక్యం చేసుకుంటారు. ఆ పోలీస్ మాత్రం ఇలా చేయలేదు. ప్రాణాలకు తెగించి చేజ్ చేసి మరి ఓ వ్యక్తిని ఢీ కొట్టిన ట్రక్కు డ్రైవర్ ను పట్టుకున్నాడు.

పాకిస్థాన్ లో ట్ర‌క్కు డ్రైవర్ ఓ వ్య‌క్తిని ఢీ కొట్టి ఆప‌కుండా వెళ్లిపోయాడు. వెంటనే ఓ పోలీస్ ఆఫీస‌ర్ ట్ర‌క్కును ఫాలో చేసి మరి ట్రక్కు ముందు ఎక్కాడు. పోలీస్ ట్ర‌క్కు ఎక్కాడ‌నే భ‌యంతో స్పీడ్ పెంచాడు. . అయినా.. పోలీస్ ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా ట్ర‌క్కు పై అలాగే నిల‌బ‌డ్డాడు. కొంత‌దూరం వెళ్లాక‌.. ముందు ట్రాఫిక్ జామ్ అవ్వ‌డంతో ట్ర‌క్కును ఆప‌క త‌ప్ప‌లేదు. వెంట‌నే డ్రైవ‌ర్ ను అదుపులోకి తీసుకున్నాడు ఆ పోలీసు.దీన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వైరల్ అవుతోన్న ఆ వీడియో మీరూ చూసేయండి..