Brazil dominates South Korea 4-1 to advance to World Cup quarter-final against Croatia
mictv telugu

బ్రెజిల్ గోల్స్ వర్షం..దక్షిణ కొరియాపై గెలుపు

December 6, 2022

ఫిఫా – 2022 ప్రపంచకప్‌లో టైటిల్ ఫేవరెట్‌ బ్రెజిల్ దూసుకుపోతుంది. దక్షిణ కొరియాతో నేడు జరిగిన రౌండ్- 16 మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. బ్రెజిల్ ధాటికి దక్షిణ కొరియా చేతులెత్తేసింది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో బ్రెజిల్ 4-1తో గెలుపొందింది. గ్యాప్ లేకుండా వరుసు గోల్స్‎తో దక్షిణ కొరియాను బ్రెజిల్ ఆటగాళ్లు బెంబేలెత్తించారు. మ్యాచ్ తొలి అర్ధభాగంలోనే వారు చెలరేగారు. గ్యాప్ ఇవ్వకుండా వరుస గోల్స్ కొట్టేశారు. పది నిమిషాలకు ఓ గోల్ చొప్పున మొత్తం 40 నిమిషాల్లోనే నాలుగు గోల్స్ బ్రెజిల్ సాధించింది . బ్రెజిల్ ప్రపంచకప్ చరిత్రలో 1954 తర్వాత తొలి అర్ధ భాగంలో నాలుగు గోల్స్ సాధించడం ఇదే తొలిసారి. గ్రూప్ దశలో గాయపడి విశ్రాంతి తీసుున్న స్టార్ ఆటగాడు నెయ్‎మార్‎తో పాటు, వినిసియస్, రిచర్లిసన్, లుకాస్ లు గోల్స్ సాధించారు. ఈ విజయంతో వరుసగా ఎనిమిదోసారి ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న దేశంగా చరిత్ర సృష్టించింది. బ్రెజిల్ క్వార్టర్స్‌లో క్రొయేషియాతో తలపడుతుంది. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన బ్రెజిల్‌కు 2002 తర్వాత ప్రపంచకప్ టైటిల్ ఇంతవరకు గెలవలేదు.