Brazil man walks on rope between two hot air balloons
mictv telugu

తాడు మీద నడిచి రికార్డు కొట్టేశాడు!

November 22, 2022

Brazil man walks on rope between two hot air balloons

సాహసమే నా ఊపిరి అంటూ బ్రెజిల్కి చెందిన రాఫెల్ బ్రిడీ ముందుకు సాగుతున్నాడు. తాడు మీద నడిచి ఇప్పటికే రెండుసార్లు గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కాడు.సర్కస్లో రెండు కట్టెలను పాతి.. వాటికి తాడును కడుతారు. ఎవరైనా ఆ తాడు మీద నడుస్తూ ఒక చివర నుంచి మరో చివరకు చేరుకుంటారు. ఈ ఫీట్ని హైలైన్ అంటారు. అదే ఫీట్ని ఆకాశంలో పోతున్న వేటికైనా తాడు కట్టి దాటేస్తే ఎలా ఉంటుంది? ఆలోచిస్తేనే భయం అవుతుంది కదా! ఇలాంటి ఎన్నో ఫీట్లను చేశాడీ స్కైలైన్ అథ్లెట్ రాఫెల్. ప్రస్తుతం రెండు బెలూన్ల మధ్య తాడును కట్టి నడిచాడు. అది కూడా.. 6326 ఫీట్ల ఎత్తులో.. 25సెంటీమీటర్ల తాడును కాళ్లకు ఏమీ వేసుకోకుండా దాటాడు. ఈ ఎత్తు రెండు బుర్జ్ ఖలీఫాల కంటే ఎక్కువ.

సాహసం అంటే.. కొండలు ఎక్కడం, అక్కడి నుంచి దూకడం, సముద్రంలోకి దూకడం, విమానం నుంచి దూకడం.. ఇలా చెబుతూపోతే చాలానే ఉంటాయి. అయితే హైలైన్ అథ్లెట్ ఒక అరుదైన ఫీట్ చేశాడు. రఫెల్.. రెండు హాట్ బెలూన్ల మధ్య తాడును కట్టాడు. ఆ రెండు ఆకాశంలోకి వెళ్లాక ఒక బెలూన్ నుంచి మరో బెలూన్లోకి ఆ తాడు మీద నడుస్తూ వెళ్లాడు. ఈ సాహాసానికి ఇన్స్టా 360 కంపెనీ కూడా తోడైంది. ఈ సాహసాన్ని తమ యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేశారు. రాఫెల్ కూడా తన ఇన్స్టాలో ఈ సాహాసానికి సంబంధించిన వీడియో పోస్ట్ చేశాడు.

ఈ సాహసాన్ని తన సొంత ఊరయిన బ్రెజిల్లోని ఫ్లోరియానోపొలిస్లో చేశాడు. ఇప్పటికే గాల్లో నడిచే ఫీట్లు ఎన్నోచేశాడు. 2020లో మండుతున్న అగ్నిపర్వతం పైన తాడు కట్టి ఒక చివర నుంచి వేరే చివరకు దాటాడు. ఇది వరల్డ్ రికార్డుగా నిలిచింది. ‘నా ఫొటోని నేను ఒంటరిగా ఎప్పుడూ చూసుకోను’ అంటున్నాడు రఫెల్. మరిన్ని సాహాసాలు కూడా చేయడానికి తాను సిద్ధం అని చెబుతున్నాడు. మరెందుకాలస్యం అతనికి ఆల్ ద బెస్ట్ చెప్పేయండి.