దేశాధ్యక్షుడిపై పక్షుల దాడి.. గాయాలు - MicTv.in - Telugu News
mictv telugu

దేశాధ్యక్షుడిపై పక్షుల దాడి.. గాయాలు

July 16, 2020

కాకులను గెలికితే అవి రచ్చ రచ్చ చేస్తాయన్న విషయం తెలిసిందే. రోడ్డు మీదకు వస్తే కావుకావు అని నెత్తి మీద పొడుస్తుంటాయి. అలాంటి అనుభవమే ఓ దేశాధ్యుక్షుడికి ఎదురైంది. కాకపోతే కాకులకు బదులు పక్షులు ఉన్నాయి ఇక్కడ. ఆయన చేతిని తీవ్రంగా గాయపరిచాయి. బ్రెజిల్ అధ్యక్షుడు జైరో బోల్సోనారోకు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరకుండా అధికార నివాసంలోనే చికిత్స పొందుతున్నారు. అధికార భవనాన్నే క్వారెంటైన్ సెంటర్‌గా మార్చుకున్న ఆయనకు అక్కడ పక్షులతో చేదు అనుభవం ఎదురైంది

ఊరికే బెడ్డు మీద పడుకుని పడుకుని ఆయనకు బోర్ కొట్టింది. దీంతో అక్కడే ఉన్న రియా పక్షులతో కాలక్షేపం చేయాలని అనుకున్నారట. అనుకున్నదే తడవుగా వాటి వద్దకు వెళ్లి గింజలు వేయసాగారు. ముఖానికి మాస్కు కట్టుకుని ఆహారాన్ని రియా పక్షులకు అందిస్తుండగా.. ఒక్కసారిగా అవి ఆయన పైకి వచ్చేశాయి. గింజల కోసం పోటీపడ్డాయి. ఈ క్రమంలో అధ్యక్షుడి చేతిని గట్టిగా పట్టుకున్నాయి. దీంతో వాటి కాలి వేళ్ల గోర్లు ఆయన చేతిని గాయపరిచాయి. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న దేశాల లిస్టులో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు అక్కడ కరోనాతో 65 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు.