దేశాధ్యుక్షుడికి కరోనా.. ఊపిరితిత్తులు క్లీన్ అయ్యాయని.. - MicTv.in - Telugu News
mictv telugu

దేశాధ్యుక్షుడికి కరోనా.. ఊపిరితిత్తులు క్లీన్ అయ్యాయని..

July 7, 2020

 razil

కరోనా తన ప్రతాపాన్ని ప్రతీ ఒక్కరి మీదా చూపిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు అందరినీ టార్గెట్ చేస్తానని విర్రవీగిపోతోంది. ఇప్పటికే చాలా దేశాల అధ్యక్యులు, ప్రధాన మంత్రులు కరోనా బారిన పడగా.. తాజగా బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారోకు కరోనా సోకింది. తనకు పాజిటివ్ వచ్చినట్టుగా బోల్సనారో ఈరోజు ధృవీకరించారు. ఈ విషయమై ఓ జర్నలిస్ట్ ఆయనను ‘గతంలో ఐదు వేల మంది కరోనాతో చనిపోయారు కదా’ అని ప్రశ్నించారు. అందుకు ఆయన ‘సో వాట్’ అని వ్యాఖ్యానించిన ఆయన ఇప్పుడు కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. తరచూ కరోనా వైరస్ పరీక్షలను చేయించుకోవడం వల్ల తన ఊపిరి తిత్తులు క్లీన్ అయ్యాయని చెప్పారు.

గత మార్చి నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయిన ప్రతినిధి బృందంలో చాలా మంది సభ్యులు వైరస్ బారిన పడ్డారు. ఈ క్రమంలో బోల్సోనారోకు కూడా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో ఆయనకు మూడుసార్లు నెగిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. కాగా, బ్రెజిల్‌లో కరోనా రోజురోజుకు వికృతరూపం దాలుస్తోంది. ఈ క్రమంలో లాక్‌డౌన్ విధించేందుకు ససేమిరా అన్న బోల్సోనారో అప్పట్లోనే వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు. ప్రస్తుతం బ్రెజిల్‌లో 16,26,071 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  65,556 మంది మృత్యువాతపడ్డారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న దేశాల్లో ప్రథమ స్థానంలో అమెరికా నిలవగా.. రెండో స్థానంలో బ్రెజిల్ నిలిచింది. ఇక  మూడో స్థానంలో భారత్ నిలిచింది.