బొద్దింకలను చంపాలనుకున్నాడు.. కానీ ఇలా జరిగిందేంటీ.? - MicTv.in - Telugu News
mictv telugu

బొద్దింకలను చంపాలనుకున్నాడు.. కానీ ఇలా జరిగిందేంటీ.?

October 26, 2019

తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్టు.. ఓ వ్యక్తి బొద్దింకలను చంపాలని చూస్తే ఏకంగా భారీ పేలుడు సంభవించింది. బ్రెజిల్‌లోని ఓ ఇంటి గార్డెన్‌లో ఈ ఘటన జరిగింది. సెసార్ షుమిట్జ్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో బొద్ధింకలు ఎక్కువగా ఉండటంతో అతని భార్య వాటిని చూసి చిరాకు పడింది. ప్రతిసారి అవి భయటకు రావడంతో వాటిని చంపేయాలని అతను నిర్ణయించుకున్నాడు. దీనికోసం ఓ ఉపాయం ఆలోచించి వాటి పని పట్టాలనుకున్నాడు. కానీ చివరికి అతనికే ఊహించని పరిణామం ఎదురైంది.

గార్డెన్‌లో బొద్దింకలు ఓ మట్టి గూడులో ఉండటాన్ని అతడు గమనించాడు. ఇక ఎలాగైనా వాటిని కాల్చేయాలని భావించి కన్నంలో గ్యాసోలిన్ పోసి ఆ పుట్టను నాశనం చేయాలని అనుకున్నాడు. వెంటనే అగ్గిపుల్ల వెలిగించి దాంట్లో వేశాడు. గ్యాసోలిన్ కారణంగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో చుట్టూ ఉన్న వస్తువులు ఎగిరిపడ్డాయి. కానీ ఆ బొద్దింకలు మాత్రం చనిపోలేదు. పేలుడు జరిగిన తర్వాతా మెల్లగా అతని పక్క నుంచే పారిపోతూ కనిపించాయి. ఈ తంతంగం అంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఇది చూసిన వారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు.