ఇతనికి 9 మంది భార్యలు.. 10 పెళ్లికి రెడీ అవుతుండగా షాక్.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇతనికి 9 మంది భార్యలు.. 10 పెళ్లికి రెడీ అవుతుండగా షాక్..

April 6, 2022

bfbf

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవో లేదో తెలియదు కానీ ఇతడు తలచుకుంటే అమ్మాయిలు వల్లో వచ్చి వాలుతున్నారు. అందుకే ఒకరిని కాదు, ఇద్దర్ని కాదు ఏకంగా 9 మందిని పెళ్లాడాడు. భయపెట్టో, మోసం చేసో కాదు, వారి అంగీకారంతోనే. 10మంది భార్యలతో కాపురం చెయ్యాలని టార్గెట్ పెట్టుకున్న అతనికి ఇంతలో షాక్ తగిలింది. ఉన్న భార్యల్లో ఒకామె విడాకులు కోరింది.

బ్రెజిల్‌కు చెందిన మోడల్ ఆర్థర్ ఉర్సో కథ ఇంది. మోడల్ కావడంతోపాటు రసికుడని కూడా పేరుండడంతో 9 మంది యువతులు అతణ్ని పెళ్లాడారు. ఏ తగవులూ లేకుండా చక్కగా కాపురం చేసుకుంటున్నారు. అయితే ఇటీవల ఆ భార్యామణుల్లో ఒకరైన అగాథాకు ఈ తతంగం నచ్చలేదు. ‘నా మొగుడు నాకే సొంతం’ అని పోట్లాడింది. అయితే ఆర్థర్ ఆమె కోసం 8 మందిని వదులుకోడానికి సిద్ధంగా లేదు. అగాథా కూడా వెనక్కి తగ్గలేదు. దీంతో ‘బాధ’తో అతడు బజారుకెక్కాడు. ‘మనం ఏదైనా పంచుకోవాలి. కానీ అమెకది నచ్చడం లేదు. అదే నాకు దిగ్భ్రాంతి కలిగించింది’ అని అంటున్నాడు ఆర్థర్. తనకు 10 మంది భార్యలు ఉండాలన్నది తన కల అని అంటున్న ఈ మగముదురు ఇంకో రెండు పెళ్లిళ్లు చేసుకుని ఆ కోరిక నెరవేర్చుకుంటా అంటున్నాడు. బ్రెజిల్లో బహుభార్యత్వం చట్టవిరుద్ధమే అయినా అతని భార్యలు కోర్టుల దాకా వెళ్లకపోవడంతో సంసారాలు సాఫీగానే సాగుతున్నాయి.