అతిగా ఆవేశపడిన మగవాడు.. కుమ్మిపారేసిన ఆడది - MicTv.in - Telugu News
mictv telugu

అతిగా ఆవేశపడిన మగవాడు.. కుమ్మిపారేసిన ఆడది

April 24, 2019

కొంతమందికి ఈ లోకం పట్టదు. పైగా కామోత్సాహంలో ఉంటే అస్సలు పట్టదు. పిల్లాపెద్దా బిలబిలమని తిరుగాడే సముద్ర తీరంలో ఓ వ్యక్తి పాడుపనికి తెరలేపాడు. స్విమ్ షూట్‌లో ఫొటోలు తీసుకుంటున్న ఓ మహిళను చూసి చొంగకార్చేస్తూ హస్తప్రయోగం ప్రారంభించాడు. ఛీఛీ.. ఇదేం పాడుపని అని అందరూ తప్పుకుని పారిపోయారు. కానీ  సదరు స్విట్ షూట్ మగువ మాత్రం ఊరుకోలేదు. అతని వద్దకు వెళ్లి కాళ్లతో, చేతులో ఢిష్యూం ఢిష్యూమంటూ చావగొట్టేసింది.

BRAZILIAN MMA FIGHTER JOYCE VIEIRA PUNCHES MAN MASTURBATING IN FRONT OF HER DURING PHOTO SHOOT

బ్రెజిల్‌లోని రియోడిజనీరోలోని ప్రేయ డో బ్రాగా బీచ్‌లో ఈ తతంగం జరిగింది. జాయిస్ వియెరా మార్షల్ ఆర్ట్స్ యోధురాలు తన బాయ్ ఫ్రెండుతో కలసి అక్కడికి షికారుకు వెళ్లింది. స్విమ్ సూట్‌లో ఫొటోలకు పోజులివ్వసాగింది. ఆమెను చూసిన నడివయస్కుడు కోరిక తట్టుకోలేక హస్త ప్రయోగం ప్రారంభించాడు. మరీ ఇంత నీచమా అంటూ వెళ్లి అతణ్ని చావగొట్టింది. ఆ దెబ్బలు తాళలేక అతడు కాలికి బుద్ధిచెప్పాడు. అయితే దీనిపై మిశ్రమ స్పందన లభిస్తోంది. పబ్లిక్ స్థలాల్లో స్విమ్ షూట్లతో పోజులిస్తే ఇలాగే జరుగుతుందని,  వియెరా కూడా తప్పు చేసిందని నెటిజన్లు తిడుతున్నారు.