రష్యా క్షిపణి దాడిలో బ్రెజిల్ మోడల్ మ‌ృతి - MicTv.in - Telugu News
mictv telugu

రష్యా క్షిపణి దాడిలో బ్రెజిల్ మోడల్ మ‌ృతి

July 6, 2022

రష్యా ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధంలో విదేశీ పౌరులు కూడా మరణిస్తున్నారు. ఆ దేశానికి సహాయంగా వచ్చిన విదేశీయులు రష్యాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ కోవలో 39 ఏళ్ల బ్రెజిల్ మోడల్ తలిత డు వాల్లె చేరింది. ఖర్కీవ్ నగరంపై జరిగిన దాడిలో జూన్ 30న ఆమె మరణించినట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది. లా చదివిన తలిత కొన్నాళ్లు మోడల్‌గా, నటిగా పనిచేసింది.

ఎన్జీవోలతో కలిసి అనేక మానవతా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంది. తర్వాత ఇరాక్‌లోని కుర్దిస్తాన్ డిమాండుతో ఏర్పడిన సాయుధ దళంలో పనిచేసింది. అక్కడే స్నైపర్ షూటింగులో ప్రావీణ్యం సంపాదించింది. యుద్ధంలో తనకు ఎదురైన అనుభవాలను వీడియోలు రూపొందించి వాటిని యూట్యూబులో పెట్టింది. కాగా, చనిపోయే ముందు కొన్ని రోజుల పాటు ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడలేదు. రష్యన్ బలగాలు సమీపిస్తున్నాయని, ఫోనులో మాట్లాడితే శత్రువు డ్రోన్లకు దొరికిపోయే ప్రమాదం ఉండడంతో కనీసం ఫోనులో కూడా మాట్లాడుకోలేకపోయామని ఆమె సోదరుడు థియో రొడ్రిగో విరా పేర్కొన్నాడు.