కరోనా లేదు, గిరోనా లేదు.. బయటికొచ్చి పని చేస్కోండి.. బ్రెజిల్ అధ్యక్షుడు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా లేదు, గిరోనా లేదు.. బయటికొచ్చి పని చేస్కోండి.. బ్రెజిల్ అధ్యక్షుడు

March 25, 2020

Bolsonaro

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఎన్నో దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో కోట్లాది ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. కరోనా వైరస్ ప్రభావిత దేశాల్లో ఒకటైన బ్రెజిల్ దేశంలోనూ పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి. మరోపక్క..  ఆ దేశ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

దేశ ప్రజలందరూ కరోనా పిచ్చిని పక్కన పెట్టి సాధారణ స్థితికి వెళ్లాలని సూచించారు. లాక్‌డౌన్ అమలు చేస్తున్న రాష్ట్రాలు ఈ విధానాలను విడనాడాలని సూచించారు. ‘ఇటలీలో చూస్తున్న పరిస్థితులు బ్రెజిల్‌లో రావు. మన దేశ జనాభాలో అధిక శాతం మంది యువత ఉండడం ఇందుకు కారణం. అనవసర ఆందోళన విడిచిపెట్టి తిరిగి పనుల్లోకి రావాలి’ అని కోరారు. బోల్సోనారో ప్రసంగం పట్ల దేశ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లోకి వచ్చి బోల్సోనారోకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.